మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే థానేలోని జూపిటర్ ఆసు పత్రిలో చేరారు. షిండేకు జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నట్లు సమాచారం. కాగా ఆసుప త్రిలో చేరే ముందు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని షిండే మీడియాకు తెలిపారు. ఏక్ నాథ్ షిండే కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉండటంతో తన స్వగ్రామం సతారాకు వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన తన తన అపాయింట్మెంట్ లన్నిం టినీ రద్దు చేసుకున్నారు. నిన్న స్వగ్రామం నుంచి ముంబైకి వచ్చారు. ఈరోజు ఆరోగ్యం కుదుటపడకపోయే సరికి కుటుంబ సభ్యులు ఆయనను థానేలోని జూపిటర్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఇవాళ ఢిల్లీలో మహాయుతి కూటమి సమావేశం జరగనుంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది అధికారికంగా తేల్చనున్నారు. ఈ నెల 5న కొత్త ముఖ్యమం త్రి ప్రమాణస్వీకారం ఉంటుంది. అనారోగ్యం కారణంగా ఏక్ నాథ్ షిండే ఇవాళ జరిగే మహాయుతి కూటమి సమావేశానికి వెళ్లే అవకాశం లేదు