Maharastra: అజిత్ పవార్‌కు..ఆర్థిక శాఖ..
కేబినెట్ విస్తరణలో భాగంగా అజిత్ పవార్‌ను మహారాష్ట్ర మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా భాద్యతలు..;
మహారాష్ట్ర మంత్రివర్గంలో అజిత్ పవార్ కీలక బాధ్యతలు చేపట్టారు. ఎన్సీపీలో తిరుగుబాటు జెండా ఎగురవేసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్‌కు కీలకమైన ఆర్థిక శాఖ కేటాయించారు. కేబినెట్ విస్తరణలో భాగంగా అజిత్ పవార్‌ను మహారాష్ట్ర మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకూ ఆయా శాఖలు కేటాయించారు. ఇతర ఎన్సీపీ ఎమ్మెల్యేలకు పౌరసరఫరాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ తదితర శాఖలు కేటాయించినట్లు అజిత్ పవార్ వర్గాలు అంటున్నాయి.ఇటీవల ఎన్సీపీని నిలువునా చీల్చిన అజిత్ పవార్.. మరో 8 మంది ఎమ్మెల్యేలతో కలిసి షిండే సర్కారులో చేరిపోయారు. అధికారికంగా ప్రభుత్వంలో చేరిన రోజే డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టగా.. మరో 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.