Maharashtra: ఆన్‌లైన్ ఆటలతో కోటిన్నర గెలుచుకున్న ఎస్సై సస్పెన్షన్
విధుల్లో ఉండి బెట్టింగ్‌కు దిగినందుకు ఎస్సైపై ఉన్నతాధికారుల ఆగ్రహం;
ఆన్‌లైన్ ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫాం డ్రీమ్ 11లో బెట్టింగ్‌తో కోటిన్నర గెలుచుకున్న ఓ ఎస్సైపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమించి పోలీస్ శాఖ పరువుకు భంగం కలిగించినందుకు గాను విధుల నుంచి సస్పెండ్ చేసిన్నట్టు తెలిపారు. మహారాష్ట్రలోని పింప్రీ-ఛించ్వాడ్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేసే ఎస్సై సోమ్‌నాథ్ అక్టోబర్ 10న విధుల్లో ఉండి ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్‌పై బెట్టింగులో పాల్గొన్నారని పేర్కొన్నారు. అతడిపై ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఎస్సైపై తదుపరి విచారణ బాధ్యతలను డీసీపీకి అప్పగించారు.
చించ్‌వాడ్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సోమనాథ్ జెండే గత మూడు నెలలుగా డ్రీమ్11లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ తలపడ్డాయి. ఈ ఉత్తమంగా ఆడిన ప్లేయర్లతోనే టీమ్‌ను ఎంపిక చేసుకున్నాడు. కొన్ని నెలలుగా డ్రీమ్ 11లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాని, కానీ ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చిందని తెలిపాడు. మొత్తం డబ్బు వచ్చిన తర్వాత సగం డబ్బుతో ఇంటి రుణం తీరుస్తానన్నారు. అలాగే మిగతా సగం డబ్బును భవిష్యత్తు అవసరాలకోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని, దాని ద్వారా వచ్చే వడ్డీ డబ్బులు పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తానని చెప్పారు. గొప్పగా, ఓపెన్‌గా చెప్పుకున్నాడు. దీంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ అసలు ఆన్‌లైన్ గేమ్‌లో పాల్గొనవచ్చా..? ఈ గేమ్ చట్టబద్ధమేనా..? ఇలా వచ్చిన డబ్బు గురించి మీడియాతో మాట్లాడవచ్చా..? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీనిపై పూర్తి విచారణ బాధ్యతను డీసీపీకి అప్పగించారు. నివేదిక ఆధారంగా సోమనాథ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బెట్టింగ్‌లో పాల్గొనడమే కాకుండా విధులను నిర్లక్ష్యం చేశారని.. అందుకే చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కోటీన్నర గెలిచిన ఆనందంతో ఉబ్బితబ్బియిపోతున్న సోమనాథ్ ఆనందం ఉన్నతాధికారుల చర్యతో ఆవిరైంది.