బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా ( Mahua Moitra ) లోక్ సభలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గత పార్లమెంట్లో ప్రశ్నలకు ముడుపులు తీసుకున్నారనే అభియోగాలు ఎదుర్కొన్న టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా అధికార భాజపాపై విరుచుకు పడ్డారు.
తన గొంతును అణచివేసినందుకు ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుందని ఎద్దేవాచేశారు మహువా. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పై చర్చ సందర్భంగా, మహువా మాట్లాడుతూ, గత సభలో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నా గళాన్ని అణచివేశారు. సభ్యత్వాన్ని రద్దుచేసి బహిష్క రణ వేటువేశారు. ఒక ఎంపీని అణగదొక్కినందుకు బీజేపీ భారీ మూల్యం చెల్లించుకుంది. వారికి ప్రజలు సరైన సమాధానం ఇచ్చారు. ఎన్నికల్లో ఆపార్టీకి చెందిన 63 మంది ఎంపీలను ప్రజలు ఇంటికి పంపించారు అని ధ్వజమెత్తారు.
ప్రస్తుత ప్రభుత్వంలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదని, మిత్రపక్షాలపై ఆధార పడాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ సంకీర్ణం ఎంతోకాలం నిలవదని జోస్యం చెప్పారు మహువా.