ఇటీవల జాబ్‌లోకి ఎక్కిన తర్వాత భర్తను వదిలేసిన భార్య ఘటనను మరవక ముందే, అందుకు భిన్నంగా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత భార్యను వదిలేసి మరో మహిళతో ఉంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నేను ఇళ్లల్లో పనులు చేస్తూ, తన డబ్బులతో అతనిని చదివించానని భార్య వాపోయింది.
మధ్యప్రదేశ్‌కి చెందిన మమతా, కమ్రు ఇద్దరూ 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మమతా ఇళ్లల్లో పనులు చేస్తూ సంపాదిస్తుండగా, కుమ్రు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాడు. 2019లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా జాబ్ సాధించాడు.
రత్లాం అనే ప్రాంతంలో ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా మరో మహిళతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి మమతను తన పుట్టింటికి పంపి ఆ మహిళతో నివసిస్తున్నాడని భార్య వెల్లడించింది. మమతాకి ఇంతకు ముందే పెళ్లి అయ్యి, బాబు ఉన్నాడు. భర్త చనిపోవడంతో కుమ్రుని వివాహం చేసుకుంది. కొద్ది నెలల క్రితం బాబు కూడా మరణించాడు.
చాలా సార్లు ఈ విషయంపై నిలదీయడంతో భార్యతో ఉండడానికి నిరాకరిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే 2021 ఆగస్ట్‌లో అతనిపై కేస్ ఫైల్ చేసింది. దీంతో దిగివచ్చిన సదరు ఆఫీసర్ నెలకు 12000 తన ఖర్చులకు ఇస్తానని అంగీరించాడని తెలిపింది. అయితే ఆ ఖర్చుల డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని ఆరోపణలు చేసింది. కోర్టులో మమతాని తన భార్యగా అంగీకరించినట్లు మమతా లాయర్ వెల్లడించాడు. ఈ కేసుకు సంబంధించిన జులై 22న కోర్టులో వాదనలు జరగనున్నాయి.
అయితే ఈ ఘటనకు భిన్నంగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. తన భార్య జ్యోతి మౌర్య సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అయిన తర్వాత తనను వదిలేసి వేరే వ్యక్తితో ఉంటూ తనపై వేధింపుల కేసు పెట్టిందని ఓ వ్యక్తి ఆరోపించాడు. దీనికి సంబంధించి పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.