Manipur: కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు..‘బఫర్ జోన్’గా ప్రకటన
పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా భద్రతా బలగాలు కొన్ని ప్రాంతాల్ని ‘బఫర్ జోన్’గా మార్చాయి.;
మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు మృతి చెందారు. తెల్లవారుజామున మరో ముగ్గురు టీనేజర్లు మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలు బిష్ణుపుర్ - చురాచాంద్‌పుర్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. 24 గంటల వ్యవధిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రెండు నెలలుగా బిష్ణుపుర్- చురాచాంద్‌పుర్ సరిహద్దులో హింస, హత్యలు, దహన సంఘటనలు చెలరేగుతూనే ఉన్నాయి.
దీంతో ఈ సరిహద్దులోని కొన్ని గ్రామాలు సున్నిత ప్రాంతాలుగా మారాయి. పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని‘బఫర్ జోన్’గా మార్చాయి. ఇళ్లపై కాల్పులు జరపకుండా బలగాలు ఆపగలిగాయి. అయితే కాంగ్వాయ్, సాంగ్‌డో, అవాంగ్ లేఖై గ్రామాల్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయని తెలిపారు సీనియర్ భద్రతా అధికారి.