దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశభక్తికి ఓ సంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. 2009 సంవత్సరంలో ప్రధాని పదవిలో ఉన్న సింగ్ కిష్టమైన గుండె సంబంధిత శస్త్ర చికిత్సకు వెళ్లాల్సి వచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యబృందం దాదాపు 10 గంటలు ఆపరేషన్ నిర్వహించారు. చికిత్స విజయవంతమైంది. ఆయన కాస్త కోలుకున్నారు.. దాంతో శ్వాసతీసుకోవడానికి వీలుగా అమర్చిన పైపును తీసివేశారు. ఆ సమయంలో ఆయన దేశం గురించి ఆరా తీశారు. నా దేశం ఎలావుంది? కాశ్మీర్ ఎలావుంది? డాక్టర్లను అని అడిగారట. నాకు సర్జరీ గురించి ఎలాంటి బెంగాలేదు. నా ఆలోచనంతా నా దేశం గురించే అని అన్నారట. ఆనాటి జ్ఞాపకాలను డాక్టర్ రమాకాంత్ పాండా గుర్తుచేసుకున్నారు. మన్మోహన్ కు సర్జరీ చేసిన ఎయిమ్స్ వైద్యబృందంలో డాక్టర్ పాండా ఒకరు.