Manmohan Singh : ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మ‌న్మోహ‌న్ సింగ్

Update: 2024-12-27 08:30 GMT

1932 సెప్టెంబర్ 26న ఇప్ప‌టి పాక్‌లోని చ‌క్వాల్‌లో మ‌న్మోహ‌న్ సింగ్ జ‌న్మించారు. 2004-2014 వ‌ర‌కు ప్ర‌ధానిగా ఆర్థిక సంస్క‌ర‌ణ‌లకు పెద్దపీట వేశారు. నెహ్రూ, ఇందిరా, మోదీ త‌రువాత అత్య‌ధిక కాలం దేశ ప్ర‌ధానిగా కొన‌సాగారు. 33 ఏళ్ల‌పాటు పార్ల‌మెంటు స‌భ్యుడిగా కొన‌సాగారు. 1991లో రాజ్య‌స‌భ‌లో అడుగుపెట్టారు. పీవీ న‌ర‌సింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా ప‌నిచేశారు. ఆర్థిక శాఖలో సలహాదారుగా, కార్యదర్శిగా, RBI గవర్నర్‌గా కూడా పనిచేశారు.

RBI గవర్నర్‌గా ఉన్న మ‌న్మోహ‌న్‌కు రాజ‌కీయాలు ప‌రిచ‌యం చేసింది పీవీ న‌ర‌సింహారావు అనే చెప్పాలి. 1991లో దుర్భర ఆర్థిక ప‌రిస్థితుల నుంచి దేశాన్ని గ‌ట్టెక్కించ‌డానికి సింగ్‌ను రాజ్యస‌భ‌కు పంపి ఆర్థిక మంత్రిని చేశారు. Liberalisation, Privatisation, Globalisation పాలసీతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణ ద్వారా నాటి సంస్కరణలు నేటికీ చిరస్థాయిగా నిలిచాయి.

Tags:    

Similar News