పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న ఓ ఆక్సిజన్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ప్లాంట్‌లో ఆక్సిజన్ సిలిండర్ నింపుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.ఈ పేలుడు జరిగిన వెంటనే సహాయక చర్యలు మొదలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పంజాబ్‌లోని పారిశ్రామిక ప్రాంతం ఫేజ్ 9లో జరిగింది. ప్లాంట్‌లోని సిలిండర్లలో ఒకటి పేలిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను ఆసిఫ్ మరియు దవిందర్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.