Madras High Court : మెటర్నిటీ లీవ్ మహిళా ఉద్యోగుల హక్కు : మద్రాస్ హైకోర్టు

Update: 2025-07-01 07:15 GMT

మెటర్నిటీ లీవ్ మహిళ ఉద్యోగుల ప్రాథమిక హక్కు అని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. కంపల్సరీ బాండ్ సర్వీస్ కాలానికి కూడా ఇది వర్తిస్తుందని తీర్పు చెప్పింది. ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగి కానప్పటికీ.. ఆర్టికల్ 21 ప్రకారం ప్రసూతి సెలవుల విషయంలో ఈ హక్కు ఉంటుందని జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ కె.రాజశేఖర్ తో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. తంజావూర్ మెడికల్ కాలేజీలో ఎంఎస్ జనరల్ సర్జన్ పూర్తి చేసిన డాక్టర్ క్రితికకు 2019లో తిట్టకుడి ప్రభుత్వ ఆస్పత్రిలో అసిస్టెంట్ సర్జన్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం రెండేళ్లు డ్యూటీ చేస్తానని ఆ మేరకు రూ.40 లక్షల బాండ్పై సంతకం చేశారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా డిపాజిట్ చేశారు. ఒక సంవత్సరం సర్వీసు చేసిన తర్వాత ఆమె మెటర్నిటీ లీవ్ తీసుకున్నారు. బాండ్ ప్రకారం మెటర్నిటీ లీవు కాలాన్ని పరిగణలోకి తీసుకోని అధికారులు ఆమె సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

Tags:    

Similar News