Central Government : వడ్ల కనీస మద్దతు ధరవడ్లకు రూ.2,389 మద్దతు

Update: 2025-05-29 12:30 GMT

వడ్ల కనీస మద్దతు ధరను రూ.2, 389కి పెంచుతూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాల్ కు రూ.2,320 ఉండగా, 2025-26 ఖరీస్ సీజన్ నుంచి మరో రూ.69 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పత్తి క్వింటాల్ పై రూ.589 పెంచడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిసింది. దీంతో కాటన్ రేటు రూ. 8,110కి పెరగనుంది. మొత్తం 14 రకాల పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఇందు కోసం రూ.2.07 లక్షల కోట్లు కేటాయించి నట్టు తెలిపారు. గత 1011 ఏళ్లలో ఖరీఫ్ వరి గ్రేడ్-ఏ రకం పంటలకు ఎంఎస్పీ భారీగా పెంచినట్లు తెలిపారు. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లు కేటాయించగా.. రైతులకు పెట్టుబడిపై 50శాతం మార్జిన్ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పే ర్కొన్నారు. ఏపీలోని బద్వేల్ నెల్లూరు ఫోన్లేన్ రహదారి అభివృద్ధికి కేంద్ర పొద్దుతిరుగుడు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.3,653 కోట్లతో 108.134 కి.మీల పొడవున ఈ రహదారిని అభివృద్ధి చేయనుంది. దీనితో పాటు వార్థా-బల్లార్షా, రత్లాం-నాగాడా హైవేలను కూడా ఫోర్న్ గా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది.  

Tags:    

Similar News