Mission Sarpa Vinash : మిషన్ సర్ప వినాశ్.. శ్రీనగర్‌లో ఉగ్రవాదుల ఏరివేత

Update: 2024-07-26 08:45 GMT

జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులను సమూలంగా తుదముట్టించాలన్న లక్ష్యంతో కేంద్ర రక్షణ శాఖ ఆపరేషన్ సర్చ్ వినాశ్ 2.0 ను ప్రారంభించింది. ఇటీవలి కాలంలో జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత సైన్యం సరికొత్త ఆపరేషనకు శ్రీకారం చుట్టింది.

ఇది గత 21 ఏళ్లలో సైన్యం నిర్వహించనున్న అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక చర్య. జమ్మూ డివిజన్లో నక్కి ఉన్న 55 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడమే ఈ ఆపరేషన్ లక్ష్యం. ఈ ఆపరేషన్ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నేరుగా పర్యవేక్షించనున్నారు. జమ్మూలో ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు జాతీయ సలహాదారు, ఆర్మీ చీఫ్కు అందజేస్తూ వారిచ్చే సూచనల మేరకు ఆపరేషన్ కొనసాగించనున్నారు. గత రెండేళ్లలో జమ్మూకాశ్మీర్లో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో 48 మంది ఆర్మీ జవాన్లు వీరమరణం పొందిన నేపథ్యంలో ఈ ఆపరేషన్ ను ముమ్మరంగా చేపట్టాలని నిర్ణయించారు.

ఈ దాడుల వెనక ఉన్న కీలక వ్యక్తులు, సంస్థల సమాచారాన్ని సేకరించిన ఇండియన్ ఆర్మీ.. సైనికుల త్యాగాలు ఊరికేపోవద్దన్న లక్ష్యంతో ఈ సర్ఫ్ వినాశ్ ఆపరేషన్ చేపడుతున్నారు. స్థానిక ప్రజల్లో మనోధైర్యం నింపేందుకు కీలక ప్రాంతాలలో 200 మంది స్నెపర్లు, పారా కమాండోలతో కలిసి 3000 మందితో అదనపు బలగాలను మోహరించింది.

Tags:    

Similar News