నరేంద్ర మోదీ ( Narendra Modi ) మొదట RSSలో పలు హోదాల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. 1987లో బీజేపీలో ( BJP ) చేరి కార్యనిర్వాహక బాధ్యతలు చేపట్టారు. 1995లో బీజేపీ జాతీయ కార్యదర్శి అయ్యారు. 2001లో గుజరాత్ సీఎం కేశుభాయ్ పటేల్ రాజీనామాతో అనూహ్యంగా మోదీని హైకమాండ్ సీఎం చేసింది. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాకపోగా ఉపఎన్నికలో పోటీచేసి గెలిచారు. అదే సమయంలో గుజరాత్ అల్లర్ల విషయంలో ఆయనపై విమర్శలు రావడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే 2002 డిసెంబర్ లో జరిగాయి. ఈ ఎలక్షన్స్‌లో బీజేపీ విజయం సాధించడంతో మోదీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2007, 12లోనూ ముఖ్యమంత్రి అయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మోదీని బీజేపీ అధిష్ఠానం నిలబెట్టింది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయంతో సీఎం పదవికి రాజీనామా చేసి ప్రధాని అయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ గెలిచి రెండోసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. తాజాగా 2024 ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించి మూడోసారి పీఎంగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.