కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ఆరు ముఖ్యమైన బిల్లులను తీసుకువచ్చేందుకు ఎన్డీయ ప్రభుత్వం సిద్ధమైంది. 90 ఏళ్ల క్రితం నాటి ఎయిర్ క్రాఫ్ట్ చట్టం స్థానంలో భారతీయ వాయుయాన్ విధేయక్ చట్టాన్ని తీసుకువచ్చేందుకు మోడీ సర్కార్ నిర్ణయించుకుంది.
కాఫీ, రబ్బర్ బిల్లు లను కూడా ఆమోదించుకోవాలని ఎన్డీయే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సమాయత్తమవుతున్నాయి. నీట్ లీకేజీ వ్యవహారం, యూపీఎస్సీలో నకిలీ సర్టిఫికేట్లతో సివిల్స్ కు ఎంపికవడం, మనోజ్ సోనీ రాజీనామా, రైల్వే భద్రత వంటి పలు అంశాలపై ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి.