Uttar Pradesh : పెళ్లి బారాత్‌లో నోట్ల వర్షం.. వీడియో వైరల్

Update: 2024-11-20 11:45 GMT

యూపీలోని సిద్దార్థ నగర్లో ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకల్లో ఊరేగింపు సమయంలో నోట్ల వర్షం కురిసింది. వరుడి తరపు బంధువులు ఇళ్లు, జేసీబీలపై ఎక్కి అక్కడి నుంచి అతిథులపై నోట్ల వర్షం కురిపించారు. రూ.100, 200, 500 నోట్లను వెదజల్లారు. దాదాపు రూ.20 లక్షల విలువైన నోట్లను వెదజల్లినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా నోట్ల వర్షం కురవడంతో వాటిని అందుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు.

ఈ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'ఐటీకి కాల్ చేయండి', 'ఇంత డబ్బుతో నలుగురు పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి ఉండేవారు', 'ఇలా విసిరేసే బదులు అవసరమైన పేదవారికి పంచవచ్చు కదా' అని నెటిజన్లు స్పందించారు.

Tags:    

Similar News