Heavy Rainfall : 27 రాష్ట్రాల్లో ఫుల్లు వానలు.. మాన్ సూన్ సీజర్ రిపోర్ట్ ఇదే

Update: 2024-08-12 07:30 GMT

దేశంలో 27 రాష్ట్రాలు సాధారణ లేదా అధిక వర్ష పాతాన్ని కలిగివున్నాయి. ఆదివారం తెల్ల వారుజామున ఢిల్లీలోని పలుప్రాంతాల్లో.. వర్షం కురవడంతో కొన్ని ప్రాంతాలు జల మయం అయ్యాయి. గత 24 గంటల్లో 2.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్ కు చేరుకునే అవకాశం ఉందని అంచనావేసింది. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి.

వరదల కారణంగా 288 రోడ్లు మూసుకుపోయాయి. లాహౌల్, స్పితి, చంబా, సిర్మౌర్ జిల్లాలలో ఆస్తినష్టం నివేదికలు వెలువడ్డాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రాంతీయ వాతావరణ కార్యాలయం 'ఆరెంజ్' హెచ్చరికను కూడా జారీ చేసింది. ఐదు జిల్లాల్లో కాంగ్రా, మండి, సిమ్లా, సోలన్, సర్మౌర్ లోని పలుప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే, కేరళలోని పలు జిల్లాలకు 'ఆరెంజ్' అలర్ట్ ప్రకటించింది. రాబోయే రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

రానున్న నాలుగు రోజుల వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 18 రాష్ట్రాల్లో లోటు వర్షపాతం చాలా రాష్ట్రాలను వరదలు ముంచెత్తు తుండగా, దేశంలోని నాలుగింట ఒక వంతు ఇప్పటికీ కరవు పరిస్థితులను ఎదుర్కొంటోంది. బీహార్ తోపాటు అనేక ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఆగస్టు 10 నాటికి, 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సాధారణ వర్షపాత పరిస్థితులను నివేదించాయి.

Tags:    

Similar News