ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే రహదారులపై మోకాళ్లు లోతునీళ్లు ప్రవహిస్తున్నాయి.
గత 24 గంటల్లో 135 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక నగర శివార్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికే పలువురు మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే మరిన్ని రోజులు భారీగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సులు ప్రమాదకరంగా ప్రయాణించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.