వరుస భూకంపాలతో వణుకుతున్న మయన్మార్

ప్రాణభయం తో పరుగులు తీసిన జనం

Update: 2023-06-22 05:00 GMT

భారత సరిహద్దు దేశం మయన్మార్ వరసగా భూకంపాలతో వణుకుతోంది. నిన్న అర్థరాత్రి నుంచి వరసగా మూడు భూకంపాలు నమోదయ్యాయి. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు యాంగాన్ లో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. యాంగాన్ కు 174 కిలోమీటర్ల దూరంలో భూమికి 48కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర కేంద్రీకృతమైంది. అంతకు ముందు తెల్లవారుజామున 3 సుమారు గంటలకు 4.2 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. ఈ భూకంపం కేంద్రం భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో, యాంగూన్ కు 160 కిలోమీటర్ల దూరంలో ఉందని గుర్తించారు. దీనికి కొన్ని గంటల ముందు అంటే బుధవారం అర్థరాత్రి 11.57 గంటలకు మొట్ట మొదటి భూకంపం వచ్చింది.

వరసగా కొన్ని గంటల వ్యవధిలోనే మూడు భూకంపాలు రావడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ మూడు భూకంపాలు కూడా రిక్టర్ స్కేలుపై 4 కన్నా ఎక్కవ తీవ్రతతో సంభవించాయి. దీని వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్టు తెలియరాలేదు. జనం మాత్రం ప్రాణ భయంతో పరుగులు తీశారు. మాయన్మార్ లో భూకంపాలు చాలా తరచుగా సంభవిస్తూ ఉంటాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై మూడు నుండి ఆరు వరకు ఉంటుంది. తరచుగా సంభవించే ఈ భూకంపాలు మయన్మార్‌ కు సవాలుగా మారాయు.

Tags:    

Similar News