పహల్గామ్ ఉగ్రదాడి జరిగి మూడు నెలలు గడుస్తోంది. ఆ తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్‌పై ప్రతీకారం తీర్చుకుంది. కాగా పహల్గామ్‌లో సీపీఐ నాయకులు నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా పర్యటించారు. ప్రతి రెండు వందల మీటర్లకు ఓ ఆర్మీ క్యాంపు ఉందని.. అయినా టెర్రిరస్టులు దాడులకు తెగబడడం దారుణమన్నారు. పహల్గామ్ విషాద ఘటనకు కేంద్రం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్‌పై ఎన్నో అనుమానాలు ఉన్నాయని.. కేంద్రమే వాటిని నివృత్తి చేయాలన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్‌లో చర్చ పెట్టాలని నారాయణ డిమాండ్ చేశారు. ఘటన జరిగిన తర్వాత పార్లమెంట్‌లో చర్చ జరగకుండానే.. ఎంపీల బృందాన్ని వివిధ దేశాలకు పంపించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదేమన్న విహారయాత్రనా అని ప్రశ్నించారు.