National geographic Magazine :నేషనల్ మ్యాగజైన్ కూ తప్పని కాస్ట్ కటింగ్
డిస్నీని తాకిన ఆర్ధిక మాంద్యం;
నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్. 100ఏళ్లకు పైగా సహజమైన ప్రపంచాన్ని భౌగోళిక అంశాలను ప్రజలకు వివరించిన ఈ మ్యాగజైన్ తన చివరి 19 మంది స్టాఫ్ రిపోర్టర్లను తొలగించింది. హార్డ్ కాపీలను ప్రచురించడం కూడా ఆపేసింది. ఇకపై యూ ఎస్ లోని ఏ న్యూస్ స్టాండ్ లోనూ ఈ మ్యాగజైన్ కనపడదు. అంతే కాదు కాస్ట్ కటింగ్ లో భాగంగా ఆడియో డిపార్ట్మెంట్ లో ఉద్యోగులను కూడా విధుల నుంచి తప్పించింది.
అందమైన అక్షరాలు, పదాల పలకరింపుతో పాఠకుడిని తనలో లీనం చేసుకునేది పుస్తకం. ఒంటరితనంలో తోడుగా ఉండే ఓ మంచి స్నేహితుడు. మౌనం వహించిన మహాకవి. మన ఎంచుకున్న భాషలో మనతో భావాలను పంచుకొనే నోరు లేని ఉపన్యాసకుడు.
1888లో మొట్టమొదటి ప్రచురణ పొందిన నేషనల్ జియోగ్రాఫికల్ మ్యాగజైన్ ఈరోజు తన చిట్ట చివరి స్టాప్ రిపోర్టర్లను తొలగించింది. సైన్స్ కు, సహజత్వానికి పెద్ద పీట వేసే ఈ సంస్థ డిస్ని పరిధిలోకి వెళ్లిన తరువాత అంచెలంచలుగా తన సిబ్బందిని తగ్గించుకుంటూ పోయింది.. చివరికి మొత్తం స్టాఫ్ రిపోర్టర్లను తొలగించిది.. ఎంత జీతానికి పని చేసినాసరే సంస్థతో అనుబంధం ఉన్న రచయితలు ఇప్పుడు ట్వీటర్ వేదికగా ఎమోషనల్ అవుతున్నారు.
వేల కోట్ల వ్యాపారం చేసిన ఆ మ్యాగజైన్ ఇప్పుడు తన స్వంత స్టాఫ్ ను తొలగించుకొని దిక్కులు చూస్తోంది. 2015 లో మొట్టమొదటిసారిగా ఆరుగురు టాప్ ఎడిటర్ లను తొలగించింది. విజువల్ మీడియాను తట్టుకుని, డిజటల్ మీడియాను ఢీకొని నిలబడడానికి ప్రయత్నించి..ఇప్పుడు స్టాఫ్ ఉద్యోగులను తొలగించుకొని ఫ్రీలాన్సర్ లకు పెద్ద పీట వేస్తోంది. అంతేకాదు స్టాఫ్ వెళ్ళిపోయినందువల్ల తన పుస్తకంలో పెద్దగా మార్పులు ఏమి రావని అన్నింటినీ కవర్ చేసేందుకు వీలుగా ఫ్రీలాన్సర్లను ఏర్పాటు చేసుకున్నామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇంస్టా లో ఫాలోవర్లను పెంచుకోవటం, వీడియో, ఫోటో క్వాలిటీ మెరుగ్గా ఉంచుకోవటం వంటి చర్యల ద్వారా డిజిటల్ రంగంలో తాము ముందే ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.