Gst Rates: నేటి నుంచే కొత్త జీఎస్టీ.. ఇక నుంచి రెండు శ్లాబులే

5, 18 శాతాలు మాత్రమే

Update: 2025-09-22 01:01 GMT

సవరించిన జీఎస్టీ శ్లాబ్‌ల ధరలు దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమలులోకి వస్తున్నాయి. ఇక నుంచి 5, 18 శాతం క్యాటగిరీలే ఉంటాయి. అయితే కొన్ని లగ్జరీ, సిన్‌ (హానికర) గూడ్స్‌ను 40 శాతం శ్లాబ్‌ పరిధిలోకి తెస్తారు. చాలా వరకు నిత్యావరసర వస్తువులను 5 శాతం పరిధిలోకి, ఇతర వస్తువులు, సేవలను 18 శాతం పరిధిలోకి చేర్చారు. పొగాకు, ఆల్కహాల్‌, బెట్టింగ్‌, ఆన్‌లైన్‌గేమింగ్‌ వంటి సిన్‌ గూడ్స్‌ను 40 శాతం పరిధిలోకి తెచ్చారు. 

5 శాతం పరిధిలోకి వచ్చేవి:

  • నెయ్యి, పన్నీరు, డ్రైఫ్రూట్‌లు, బిస్కట్లు, జామ్‌, కెచప్‌లు, నామ్‌కీన్‌
  • టూత్‌ పేస్ట్‌లు, సబ్బులు, షాంపూలు
  • ప్యాకేజ్‌ ఆహారం.. అనగా బిస్కట్లు, స్నాక్స్‌, జ్యూస్‌లు
  • కండెన్స్‌డ్‌ పాలు,డెయిరీ ఉత్పత్తులు
  • హెయిర్‌ ఆయిల్‌, షేవింగ్‌ క్రీమ్‌, టాల్కమ్‌ పౌడర్‌, ఫేస్‌ పౌడర్‌
  • కాఫీ, ఐస్‌క్రీమ్‌లు
  • సైకిళ్లు, స్టేషనరీ, స్కూల్‌ ఆఫీస్‌ సామాన్లు (పెన్సిళ్లు, నోట్‌బుక్స్‌)
  • దుస్తులు, పాదరక్షలు
  • ఔషధాలు, గ్లూకోమీటర్లు, డయాగ్నస్టిక్‌ సేవలు 18 శాతం పరిధిలోకి వచ్చేవి:
  • గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌: ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, డి ష్‌ వాషర్లు, పెద్ద తెర ఉన్న టెలివిజన్లు.
  • గృహ నిర్మాణం సిమెంట్‌, నిర్మాణ సామగ్రి
  • ఆటోమొబైల్స్‌: ద్విచక్ర వాహనాలు చిన్న కార్లు (1200 సీసీ కన్నా తక్కువ) ఇన్సూరెన్స్‌, ఫైనాన్స్‌
  • బీమా, ఆరోగ్య బీమా పాలసీలు
  • 40% పన్ను పరిధిలోకి వచ్చేవి..
  • పొగాకు ఉత్పత్తులు, మద్యం, పాన్‌ మసాల
  • ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గేమింగ్‌ వేదికలు.
  • లగ్జరీ వాహనాలు, ప్రీమియం లిక్కర్‌
  • 3500 సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న లగ్జరీ ద్విచక్ర వాహనాలు
  • కోకా కోలా, పెప్సీ లాంటి సాఫ్ట్‌ డ్రింక్‌లు.
  • జీఎస్టీ సంస్కరణలతో వృద్ధి వేగవంతం: మోదీ

దేశంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే జీఎస్టీ సంస్కరణలు భారత వృద్ధిని వేగవంతం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నొక్కి చెప్పారు. ఇది ఆత్మ నిర్భర్‌ భారత్‌ కోసం ఒక పెద్ద, అతిముఖ్యమైన అడుగు అని, స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహాన్నిచ్చి దేశ శ్రేయస్సుకు అనుసంధానిస్తుందని ఉద్ఘాటించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన సవరించిన జీఎస్టీ రేట్ల అమలును గుర్తు చేశారు. విదేశీ మూలాల వస్తువులు తెలియకుండానే ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయని, ఈ క్రమంలో స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని ఆయన కోరారు.

Tags:    

Similar News