Air India threat: ఖలిస్థానీ టెర్రరిస్టు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

ఎయిర్ ఇండియా ప్రయాణికులను బెదిరించటమే కారణం

Update: 2023-11-20 23:45 GMT

 ఎయిర్ ఇండియా ప్రయాణికులను బెదిరిస్తూ వీడియో విడుదల చేసిన ఖలిస్థాన్ అనుకూల నిషేధిత సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ టెర్రరిస్టు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోమవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఎయిర్ ఇండియా  ప్రయాణికులను బెదిరిస్తూ వీడియో విడుదల చేసిన ఖలిస్థాన్ అనుకూల నిషేధిత సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్టెర్రరిస్టు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పై NIA సోమవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీలోని సెక్షన్ 120B, 153A,506 కింద, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967లోని సెక్షన్ 10,13,16,17,18,18B, 20 కింద పన్నూన్‌పై కేసులు నమోదు చేసినట్టు ఎన్ఐఏ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించవద్దని, నవంబర్ 19వ తేదీ, ఆ తర్వాత ఆ విమానాల్లో ప్రయాణిస్తే వారి ప్రాణాలకు ముప్పు తప్పదని పన్నున్ ఒక వీడియోలో హెచ్చరించారు. ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది. ఎయిర్ ఇండియా ఆపరేషన్‌ను ప్రపంచంలో ఎక్కడ నుంచి కూడా జరగనీయమని కూడా ఆయన హెచ్చరించారు. పంజాబ్ నుంచి పాలస్తీనా వరకు అక్రమ ఆక్రమణలో ఉన్న వ్యక్తులు ప్రతిస్పందిస్తారని ఆయన చెప్పారు. 

అతని బెదిరింపుల ద్వారా పంజాబ్, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో భయాందోళనలను వ్యాప్తి చేశారు. ఈ హెచ్చరికలతో కెనడా, ఇండియాతో సహా ఎయిర్ ఇండియా సర్వీసులు నడుస్తున్న ప్రపంచ దేశాల్లో భద్రతా సంస్థలను అప్రమత్తం చేసినట్టు ఎన్ఐఏ తెలిపింది. అమృత్‌సర్‌లో జన్మించిన పన్నూన్ పై 2019వ సంవత్సరంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మొదటి కేసును నమోదు చేసింది.  2021 వ సంవత్సరం ఫిబ్రవరి 3వతేదీన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు పన్నూన్‌పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 29వతేదీన అతన్ని ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించింది.

 పన్నూన్ గతంలోనూ రైల్వేలు సహా నిత్యావసర రవాణా నెట్‌వర్స్ సిస్టమ్స్‌‌, ఇండియాలోని ధర్మల్ పవర్ ప్లాంట్స్‌కు ఇదే తరహాలో హెచ్చరికలు చేసినట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చ్టటం కింద ఎస్‌ఎఫ్‌జేను హోం మంత్రిత్వ శాఖ నిషేధించింది. 

Tags:    

Similar News