Bihar CM : బిహార్​ సీఎం పదవికి నితీశ్​ కుమార్​ రాజీనామా!

Update: 2024-01-29 09:19 GMT

దేశ రాజకీయాల్లో మరో మలుపు! 2024 లోక్‌సభ (Lok Sabha) ఎన్నికలకు ముందు ప్రతిపక్ష కూటమికి గట్టి ఎదురుదెబ్బ.. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు బలం చేకూరుస్తూ బీహార్ సీఎం (Bihar CM) పదవికి జేడీయూ నేత నితీష్ కుమార్ (Nitish kumar) రాజీనామా (Resign) చేశారు. ఆదివారం ఉదయం పాట్నాలో (Patna) గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ కు (Governor Rajendra Arlekhar)  ఆయన తన రాజీనామాను సమర్పించారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో జేడీయూ-ఆర్జేడీల మధ్య 2022లో ఏర్పడిన మహాఘట్బంధన్ ప్రభుత్వం ముగిసింది. నితీష్ కుమార్ మరికొద్ది గంటల్లో ఎన్డీయేలో చేరి బీజేపీతో (BJP) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

దశాబ్ద కాలంలో ఐదోసారి...!

నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని పడగొట్టి మరో కూటమిలో చేరడం దశాబ్ద కాలంలో ఇది ఐదోసారి! గత బీహార్ ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ కమలదళంతో విభేదాల కారణంగా 2022లో ఎన్డీయే నుంచి వైదొలిగి ప్రతిపక్ష ఆర్జేడీలో చేరారు. మహాఘటబంధన్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి సీఎం అయ్యారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు అడుగులు వేస్తున్నాయి.‘ఇండియా’ పేరుతో కూటమి ఏర్పడింది. అందులోని కీలక నేతల్లో నితీష్ కుమార్ ఒకరు. ఇంకా కూటమి ఏర్పాటులో ఆయనదే కీలకపాత్ర అని రాజకీయ నిపుణులు అంటున్నారు. అలాంటిది... ఇటీవలే ఆయనకు కూటమితో విభేదాలు వచ్చినట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇండియా కూటమికి తాను సమన్వయకర్తగా మారాలని ఆయన భావించారు. అదే జరిగి ఉంటే... ఎన్నికల్లో గెలిస్తే... ప్రధాని అయ్యే అవకాశం ఉండేది. అయితే కాంగ్రెస్ అందుకు అంగీకరించడం లేదనే పుకార్లు వచ్చాయి. ఫలితంగా... కాంగ్రెస్‌పై అసంతృప్తితో... కూటమి నుంచి వైదొలగాలని నితీశ్‌ కుమార్‌ భావించారు.

ఈ నేపథ్యంలో... బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ ఆదివారం ఉదయం రాజీనామా చేశారు. ‘‘నేను సీఎం పదవికి రాజీనామా చేశాను.. అన్ని వైపుల నుంచి సూచనలు వస్తున్నాయి. ఇంతకుముందున్న పొత్తు నుంచి విడిపోయి ఇందులో చేరాను. కానీ ఇక్కడ పరిస్థితి బాగాలేదు. అందుకే రాజీనామా చేశాను.. అని రాజీనామా అనంతరం నితీశ్ కుమార్ అన్నారు.

"కుటమి కోసం పనిచేశాను. కుటమి ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాను. కానీ ఎవరు ఏమీ చేయడం లేదు" అని నితీష్ కుమార్ ఇండియా ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శించారు.

ఒకప్పుడు... అద్భుత పాలనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నితీష్ కుమార్... ఇప్పుడు ప్రభుత్వాలను పడగొట్టడం, అక్కడక్కడ పొత్తులు మార్చుకోవడం వంటి వార్తల్లో నిలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News