Bihar NDA CM Candidate : నితీష్ కుమార్ మరో రికార్డ్.. బిహార్ ఎన్డీయే సీఎం అభ్యర్థిగా మళ్లీ ఆయనే
బీహార్ ఎన్డీయే సీఎం అభ్యర్థిగా నితీశ్ కుమార్నే మళ్లీ ఎన్నికున్నారు. 2025లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే కూటమి తరఫున నితీశ్ కుమార్‌ను సీఎం అభ్యర్థిగా చేసుకొని ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని బిహార్ బీజేపీ కోర్ కమిటీ నిర్ణయించింది. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో జరిగిన ఈ కమిటీ సమావేశంలో దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. సీఎం అభ్యర్థి నితీశ్ కుమారేనని.. అందులో ఎలాంటి మార్పు ఉండదని తీర్మానంలో ప్రస్తావించారు. బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. బిహార్ సీఎం అభ్యర్థిగా నితీశ్ కుమార్ ఉండాలనే దానిపై ఎన్డీయే కూటమిలోని ఐదు మిత్రపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం.