Noida Twin Towers : 103 మీటర్ల ఎత్తైన నోయిడా ట్విన్ టవర్స్ కూల్చడానికి రంగం సిద్ధం..
Noida Twin Towers : నోయిడాలో 103 మీటర్ల ఎత్తైన ట్విన్ టవర్స్ కూల్చడానికి రంగం సిద్ధమైంది.;
Noida Twin Towers : నోయిడాలో 103 మీటర్ల ఎత్తైన ట్విన్ టవర్స్ కూల్చడానికి రంగం సిద్ధమైంది. కుబుత్ మినార్ కన్నా ఈ టవర్స్ ఎత్తులో ఉంటాయి. నిబంధనలకు విరుద్ధంగా వీటిని నిర్మించారని పదేళ్ల క్రితం ఫిర్యాదు అందడంతో దీనిని కూల్చేందుకు రెడీ అయ్యారు. అయితే దీనిని కూల్చాల్సిందేనని నలుగురు వ్యక్తులు సుమారు పదేళ్ల నుంచి కష్టపడుతున్నారు. ఇందులో ఒక్కో ఫ్లాట్ ధర రూ.1.13 కోట్లు పలుకుతుంది. మొత్తం ఫ్లాట్లను అమ్మితే రూ.1200 కోట్లు వచ్చేవని అంచనా వేశారు.
ఈ ట్విన్ టవర్‌ను కూల్చడానికి మొత్తం రూ.20 కోట్లు ఖర్చుకానుంది. సూపర్ టెక్ సంస్థ 5 కోట్లు చెల్లిస్తోంది. మిగిలిన డబ్బును భవనం కూలిన తరువాత ఉండే వ్యర్ధాలు, స్టీల్ ద్వారా సేకరించొచ్చని అనుకుంటున్నారు. 4 వేల టన్నుల స్టీల్ లభించే అవకాశం ఉందంటున్నారు. పేలుడు పదార్ధాలను ఉపయోగించి ఈ నెల 28న ఈ భవనాన్ని కూల్చనున్నారు. భారత ప్రముఖ బ్లాస్టర్ చేతన దత్తా కొద్ది దూరంలో ఉండి బటన్ నొక్కడం ద్వారా రెండు ట్విన్ టవర్లు నేలమట్టం కానున్నాయి.