Omicron India: రోజురోజుకీ పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..

Omicron India: ప్రపంచదేశాల్లో వణుకుపుట్టిస్తోన్న ఒమిక్రాన్ వైరస్.. భారత్‌లోనూ ప్రతాపం చూపిస్తోంది.

Update: 2021-12-27 15:00 GMT

Omicron India: ప్రపంచదేశాల్లో వణుకుపుట్టిస్తోన్న ఒమిక్రాన్ వైరస్.. భారత్‌లోనూ ప్రతాపం చూపిస్తోంది. దేశంలో అంతకంతకూ పెరుగుతూ కేసుల సంఖ్య 578కి చేరాయి. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది. మహారాష్ట్రను దాటి అత్యధిక కేసులతో దిల్లీ తొలి స్థానానికి చేరింది. దిల్లీలో 142 మందికి ఒమిక్రాన్‌ తేలగా..మహారాష్ట్ర 141 కేసులో రెండోస్థానంలోనూ.. కేరళ 57తో మూడోస్థానంలో కొనసాగుతున్నాయి.

అటు గుజరాత్‌లో 49, రాజస్థాన్‌లో 43, తెలంగాణ 41 కేసులు నమోదయ్యాయి. ఏపీలో సింగిల్‌ డిజిట్‌ ఆరు నిర్ధరణ అయ్యాయి. ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న వేళ రాష్ట్రాలన్నీ ఆంక్షల బాట పడుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కర్ఫ్యూలతో పాటు వేడుకలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.కేసులు వేగంగా పెరుగుతుండటంతో దిల్లీలో.. నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.

రాత్రి 11 నుంచి ఉదయం ఐదింటి వరకు జనసంచారంపై ఆంక్షలు విధించారు. ఇప్పటికే కర్ణాటక ఆంక్షల బాట పట్టింది. న్యూ ఇయార్‌ వేడుకలను బ్యాన్ చేసింది. పదిరోజులపాటు నైట్ కర్ఫ్యూతో పాటు 144 సెక్షన్ అమల్లోకి ప్లాన్‌ చేస్తోంది కర్ణాటక సర్కార్. అటు మహారాష్ట్రలోనూ నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రి 9 నుంచి ఉదయం ఆరింటి వరకూ ఆంక్షలు కొనసాగుతున్నాయి 

ఇటు తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసులు 41కి చేరాయి. న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించారు. జనవరి 2 వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది తెలంగాణ సర్కార్. అటు ఏపీలోనూ సింగిల్ డిజిటిల్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురులో పాజిటివ్ తేలడంతో.. అన్నిజిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చింది.

Tags:    

Similar News