జమ్మూకశ్మీర్ లోని ( Jammu and Kashmir ) పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎనౌకౌంటర్ జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో.. వెంటనే అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
పూంచ్ ప్రాంతంలో ఇద్దరు టెర్రరిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతానికి అదనపు బల గాలను పంపించామని.. ఉగ్రవాదులు భద్రతా బల గాలపై కాల్పులు జరిపారని అధికారులు చెబుతు న్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ బృందంపై కాల్పు లు జరిపినట్లు సోర్సెస్ చెబుతున్నాయి.
అనంతరం ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు గాలిం పు చర్యలు ముమ్మరం చేశాయి. జూన్ 9 తర్వాత జమ్మూ ప్రాంతంలో ఇది ఆరో ఉగ్రవాద ఘటన.
జూన్ 9న.. ఉగ్రవాదులు యాత్రికుల బస్సుపై దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది యాత్రికులు మరణిం చారు. 41 మంది గాయపడ్డారు.