OPPOSITION MEET: ప్రతిపక్ష కూటమి పేరు "ఇండియా"!

విపక్ష కూటమికి ఇండియన్ నేషనల్‌ డెమొక్రటిక్‌ ఇన్‌క్లూజివ్‌ అలయన్స్‌ పేరు... దాదాపుగా ఖరారైనట్లు వెల్లడించిన నేతలు..;

Update: 2023-07-18 10:00 GMT

కేంద్రం అధికారంలో ఉన్న NDA కూటమిని ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్న విపక్షాలు తమ కూటమి పేరును ఇండియన్ నేషనల్‌ డెమొక్రటిక్‌ ఇన్‌క్లూజివ్‌ అలయన్స్‌(Indian National Democratic Inclusive Alliance) -"ఇండియా" ఫ్రంట్‌గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. I ఇండియన్‌ N నేషనల్‌ D డెమోక్రటిక్‌, I ఇన్‌క్లూజివ్‌, A అలియన్స్‌గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ సమావేశంలో ప్రతిపక్షాల కూటమికి భారత జాతీయ ప్రజాస్వామిక సమ్మిళిత కూటమిగా నిర్ణయించారు. బెంగళూరులో సమావేశమైన 26 పార్టీల ముఖ్యనేతల్లో చాలామంది ఇండియా పేరుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో విపక్షాల ఫ్రంట్ అధ్యక్షురాలిగా..సోనియా గాంధీని ఎన్నుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కన్వీనర్ గా నీతీశ్ కుమార్ పేరు వినిపిస్తోంది.


భాజపాపై ఐక్యంగా పోరాటం చేయాలని ఇప్పటికే నిర్ణయించిన పార్టీల నేతలు బెంగళూరులో భవిష్యత్‌ కార్యాచరణపై మథనం చేస్తున్నారు. సార్వత్రిక సమరానికి సమయాత్తమవుతున్న విపక్షాలు బెంగళూరు వేదికగా వరుసగా రెండోరోజూ విస్త్రతస్థాయిలో చర్చలు జరిపారు. ఈ భేటీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే సహా దిల్లీ, పంజాబ్, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బంగాల్, తమిళనాడు సీఎంలు పాల్గొన్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్..., సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్...., ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ హాజరయ్యారు. నిన్నటి సమావేశంలో ఉమ్మడి ప్రణాళిక రూపకల్పన, సంయుక్త ఆందోళనల నిర్వహణ లక్ష్యంగా విపక్ష నేతలు తొలిరోజు సమాలోచనలు జరిపారు.

Tags:    

Similar News