New Delhi : పార్లమెంటు ఆవరణలో జీఎస్టీ వివాదం

New Delhi : కనీస నిత్యావసరాలైన పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.;

Update: 2022-07-20 06:15 GMT

New Delhi : కనీస నిత్యావసరాలైన పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. గ్యాస్‌ ధరల పెంపుపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపాయి. చివరికి పాలు, పాల ఉత్పత్తులు, గోధుమ పిండిపైనా జీఎస్టీ విధించడం ఏంటంటూ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విపక్ష నేతలు.

రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, విపక్ష పార్టీ ఎంపీలు సహా టీఆర్‌ఎస్ ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. నిన్న కూడా పార్లమెంట్ సమావేశాలకు ముందు విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు.

Tags:    

Similar News