ఏకం కాబోతున్న విపక్షాలు..23న సమావేశం
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. విపక్షాల ఐక్యత దిశగా కీలక అడుగు పడబోతోంది.;
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విపక్షాల ఐక్యత దిశగా కీలక అడుగు పడబోతోంది. ఎల్లుండి పట్నాలో విపక్షాల సమావేశం జరగనుంది.ఇందుకోసం నీతీశ్ సర్కారు అన్ని ఏర్పాట్లూ చేసింది. 2024ల్లో బీజేపీని ఓడించడానికి రచించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. 15 ప్రతిపక్ష పార్టీలు ఈ భేటీలో పాల్గొనున్నాయి. బిహార్ సీఎం నీతీశ్‌కుమార్ అధికారిక నివాసంలోని ‘నెక్ సంవాద్ కక్షా’లో ఈ సమావేశం జరగనుంది. రేపు సాయంత్రానికే విపక్ష నేతలంతా పట్నాకు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. JDU అధినేత నీతీశ్‌కుమార్, TMC మమతా బెనర్జీ, ఆప్ అధినేత కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ, NCP చీఫ్ శరద్‌పవార్, ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, NCP చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా, PDP అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తదితరలు హాజరువుతున్నారు
ఈ సమావేశంలో ముందుగా నీతీశ్ కుమార్ కీలక ప్రసంగం చేయనున్నారు. మోదీహయాంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై, విపక్షాలు ఐక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతపైన మాట్లాడనున్నారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, కేజ్రీవాల్ ప్రసంగిస్తారు.ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాల్సిన సమయం కావడంతో.. ఈ ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో జరిగే కీలక అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆప్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఢిల్లీలో అధికారయంత్రాంగంపై పెత్తనాన్ని కేంద్రానికి కట్టబెట్టే ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని ఆప్ పట్టుబడుతోంది. కాంగ్రెస్‌తో చెప్పించే బాధ్యత మిగతా పార్టీలు తీసుకోవాలంటోంది ఆప్. దీనిపై ఖర్గే, రాహుల్‌తో చర్చించేందుకు కేజ్రీవాల్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు.