Sharad Pawar : అసలైన ఎన్‌సీపీ నాదే... సుప్రీంకోర్టులో శరద్‌పవార్ పిటిషన్
అజిత్ పవార్ సారధ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)నే అసలైన పార్టీగా ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శరద్‌పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫిబ్రవరి 13వ తేదీ సోమవారం ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం త్వరలో విచారణ చేపట్టనుంది.
అజిత్ పవార్ వర్గానిదే అసలైన ఎన్పీపీ అని తేల్చిన ఈసీ ఆ మరుసటి రోజు శరద్‌పవార్ వర్గానికి ఎన్సీపీ-శరద్‌పవార్ అనే పేరు కేటాయించింది. అయితే దీనిపై శరద్‌పవార్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 1999లో స్థాపించి నిర్మించిన ఎన్సీపీని ఈసీ లాక్కుని వేరే వాళ్లకు అప్పగించిందని ఆరోపణలు చేశారు. గతంలో ఇలాంటి ఘటన దేశంలో ఎప్పుడూ జరగలేదని శరద్‌పవార్ మండిపడ్డారు.
1999లో కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకున్న తర్వాత ఎన్సీపీని స్థాపించిన పవార్. 1999 లోక్‌సభ ఎన్నికల్లో విడిగా పోటీ చేసినా, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2004లో లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యూపీఏ సర్కార్‌లో వ్యవసాయ మంత్రిగా పని చేశారు.