Asaduddin Owaisi : ఇస్లాం పేరుతో పాక్ మారణహోమం.. అసదుద్దీన్ హాట్ కామెంట్స్
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి పాకిస్తాన్ పై సంచలన ఆరోపణలు చేశారు. పాక్ దృశ్చర్యలను ప్రతిఒక్క భారతీయుడు తిప్పికొట్టాలని పిలుపిచ్చారు. ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మారణహోమం సృష్టిస్తుందని విమర్శించారు. ఇక్కడి హిందువులకు,ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసిందన్నారు అసద్.పెహాల్గామ్ లో కుటుంబ సభ్యుల ముందు అతికిరాతకంగా చింపేసిన ఉగ్రవాదులకు.. ఆపరేషన్ సింధూర్ తో భారత సైనికులు సరైన సమాధానం ఇస్తున్నారని అన్నారు.భారతదేశ ముస్లింలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. భారత సైనికులకు అండగా ఉంటామని ఒవైసీ స్పష్టం చేశారు.