Pakistani Terrorists : జమ్ములో సామాన్యులను టార్గెట్ చేసిన పాక్ ఉగ్రవాదులు
జమ్ము కాశ్మీర్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి గ్రామాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదుల షెల్లింగ్ దాడుల్లో స్థానికుల నివాసాలు ధ్వంసమయ్యాయి. జరిగిన డ్యామేజ్ ను స్థానిక పోలీసులు పరిశీలించారు. అన్ని ప్రాంతాల్లో నిరంతరం పహారా కొనసాగిస్తున్నారు.
పోలీసులు చెప్పగానే తాము ఇళ్లు, షాప్స్ ను క్లోజ్ చేశామని.. ఐతే.. పాకిస్తాన్ ఉగ్రవాదులు షెల్లింగ్ మొదలుపెట్టారని ఓ స్థానిక వ్యాపారి ఆవేదన వ్యక్తంచేశారు. సాధారణ పౌరులను పాక్ సైనికులు టార్గెట్ చేయడం బాధాకరం అన్నారు. సైన్యాం, దేశ ప్రధానిపై తమకు అపారమైన నమ్మకం ఉందన్నారు.