Parliament Budget Session : నెలాఖరు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్

Update: 2025-01-18 11:30 GMT

జనవరి 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈసారి కూడా రెండు విడతల్లో ఈ సమావేశాలు జరుగతాయి. మొదటి విడత సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్నాయి. రెండో విడత సమావేశాలను దాదాపు నెల రోజుల విరామం తరువాత మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 4 వరకు నిర్వహించనున్నారు. కాగా, మొదటి విడత సమావేశాల తొలిరోజు ఈ నెల 31న లోక్‌సభ, రాజ్యసభ ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. అనంతరం మరుసటి రోజు ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. 2025-26కు సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతారు. బడ్జెట్‌ను నిర్మల ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వసారి కావడం గమనార్హం. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీయే సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్‌ ఇదే.

Tags:    

Similar News