Vice President Jagdeep Dhankhar : పార్లమెంటే సుప్రీం.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్

Update: 2025-04-23 08:00 GMT

పార్లమెంటు దేశంలో అత్యున్నతమైన సభ అని, ప్రజలతో ఎన్నకోబడిన ప్రతినిధులు (ఎంపీలు) రాజ్యాంగానికి అంతిమ యజమానులు అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అన్నారు. వారిపై ఎలాంటి అధికారం ఎవరికీ ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ కార్యకర్త మాట్లాడే ప్రతి మాట అత్యున్నత జాతీయ ప్రయోజనాల ద్వారా మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు. సు ప్రీంకోర్టు రెండు వేర్వేరు మైలురాయి తీర్పులలో ఐసి గోలక్నాథ్ కేసు(1967), కేశవానంద భారతి కేసు (1973) విరుద్ధమైన ప్రకటనలకు విమర్శలు ఉన్నాయన్నారు. 1975లో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన అత్యవ సరపరిస్థితి సమయంలో కోర్టు పాత్రనూ ధన్కడ్ ప్రశ్నించారు. 'ఒక సందర్భంలో సుప్రీంకోర్టు ప్ర వేశిక రాజ్యాంగంలో భాగం కాదని చెబుతోంది. మరొక సందర్భంలో అది అలాగే ఉందని చెబుతోంది. ఎన్నికైన ప్రతినిధులు రాజ్యాంగం ఎలా ఉంటుందో వాళ్లకు తెలుసు. ఎలా ఉండాలో అంతిమంగా వారే నిర్ణయించుకుంటారు. వారిపై ఎటువంటి అధికారం కోర్టుకు ఉండకూ డదు. ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి దశ ఎమర్జెన్సీ. అత్యవసర పరిస్థితి విధించడం, ప్రాథమిక హక్కులను నిలిపివేయడంపై తొమ్మిది హైకోర్టులు ఇచ్చిన తీర్పులనూ సుప్రీంకోర్టు కొ ట్టివేసింది' దేశంలోని అత్యున్నత న్యాయస్థానం తొమ్మిది హైకోర్టుల తీర్పును విస్మరించినందున నేను 'చీకటి' అని అంటున్నా. అని అన్నారు. ఇటీవల సుప్రీం కోర్ట్ బిల్లులను ఆమోదించే విషయంలో గవర్నర్, రాష్ట్రపతులకు ఒక కాల పరిమితిని నిర్ణయిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై ధన్ ఖడ్ తీవ్ర విమర్శలు చేశారు. న్యాయ మూర్తులను నియమించే రాష్ట్రపతికే ఆదేశాలు ఇవ్వడం ఏమిటని, తన జీవితంలో ఇలాంటి ఓ పరిస్థితిని చూడాల్సిన పరిస్థితి వస్తుందని తాను ఎన్నడూ అనుకోలేదని ఆయన అన్నారు.

Tags:    

Similar News