Priyanka Gandhi : ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారు: ప్రియాంకా గాంధీ

Update: 2025-02-08 16:15 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందించారు. తమ కార్యకర్తలు చాలా కష్టపడ్డారని తెలిపారు. ఓటమి నుంచి నేర్చుకుని ముందుకు సాగుతామన్నారు. ఢిల్లీ ప్రజల శ్రేయస్సు కోసం తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఆప్ సర్కారుపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, మార్పు కోరుకున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ కంగ్రాట్స్ చెబుతూ ఓడిన వారు మరింత కష్టపడాలని సూచించారు.

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించే బాధ్యతేమీ తమకు లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే వ్యాఖ్యానించారు. ‘వారి గెలుపు బాధ్యత మాది కాదు కదా? స్ఫూర్తిదాయకమైన పోరాటంతో ఎన్నికల్లో బలమైన ప్రదర్శన చేయడమే మా బాధ్యత. కేజ్రీవాల్ గోవా, హరియాణా, గుజరాత్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేశారు కదా? గోవా, ఉత్తరాఖండ్‌లో ఆప్‌కు వచ్చిన ఓట్ల తేడాతోనే మేం ఓడిపోయాం’ అని గుర్తుచేశారు.

Tags:    

Similar News