Petroleum Ministry : రిలయన్స్ కు పెట్రోలియంశాఖ ఝలక్.. రూ.24,500 కోట్లు చెల్లించాలని నోటీసులు
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు పెట్రోలియం శాఖ నోటీస్లు జారీ చేసింది. పెండింగ్లో ఉన్న కేజీ-డీ 6 ఆపరేషన్స్ లో గ్యాస్ వెలికితీసే వివాదంలో భాగంగా 2.81 బిలియన్ డాలర్లు (సుమారు 24,500 కోట్లు) చెల్లించాలని పెట్రోలియం శాఖ నోటీస్ లు జారీ చేసింది. ఈ విషయాన్ని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో సంస్థ తెలిపింది. బ్యాటరీ ప్రాజెక్టు సంబంధించిన లిక్విడేటెడ్ నష్టపరిహార్ని విధిస్తూ తమ అనుబంధ సంస్థకు భారీ పరిశ్రమల శాక నుంచి నోటీస్ అందిందని కూడా రిలయన్స్ తెలిపింది. ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్ (పీఎస్ సీ) విషయంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు, రిలయన్స్ కు మధ్య వివాదం నడుస్తోంది.