Piyush Goyal : ఉచిత బియ్యాన్ని ఏపీ పంపిణీ చేయకపోతే... హెచ్చరించిన గోయల్..

Piyush Goyal : ఉచిత బియ్యం పంపిణీ చేయకపోతే ఏపీ నుంచి బియ్యం, వడ్ల సేకరణ నిలిపేయాల్సి వస్తుందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌.

Update: 2022-07-21 02:33 GMT

Piyush Goyal : ఉచిత బియ్యం పంపిణీ చేయకపోతే ఏపీ నుంచి బియ్యం, వడ్ల సేకరణ నిలిపేయాల్సి వస్తుందన్నారు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌. ఏపీ PMGKAY కింద 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించినట్లు చెప్పారు. ఈ పథకాన్ని అమలు చేయకపోతే అందుకు తగ్గ పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని గోయల్ హెచ్చరించారు.

ఈ పథకం కింద గత ఐదు విడతల్లో ఏపీకి 23 లక్షల 75 వేల మెట్రిక్ టన్నులు అందించినట్లు లోక్‌సభలో ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇప్పటివరకూ ఉచిత బియ్యం పంపిణీ చేయని విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా..తమ దగ్గర తగినన్ని నిల్వలు ఉన్నాయని...కొన్ని నిర్దిష్టమైన సమస్యల కారణంగా పంపిణీ ఆలస్యమైందని సమాధానం ఇచ్చిందన్నారు.

Tags:    

Similar News