PM Kisan New Rule : పీఎం కిసాన్ రైతులకు షాక్..కేవైసీనే కాదు ఇది లేకుంటే రూ.2000గోవిందా.
PM Kisan New Rule : దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. ఇప్పటివరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 2,000 పొందాలంటే కేవలం ఈ-కేవైసీ చేయించుకుంటే సరిపోతుందని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు రూల్స్ మారాయి. కేవలం కేవైసీ ఉంటే సరిపోదు, ప్రతి రైతుకు ఖచ్చితంగా ఒక స్పెషల్ ఐడీ ఉండాల్సిందే. ఈ ఐడీ లేకపోతే మీ ఖాతాలోకి వచ్చే నగదు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
కేంద్ర ప్రభుత్వం అగ్రిస్టాక్ అనే సరికొత్త డిజిటల్ డేటాబేస్‌ను సిద్ధం చేస్తోంది. దీని ద్వారా ప్రతి రైతుకు ఒక యూనిక్ ఫార్మర్ ఐడీని కేటాయిస్తారు. ఆధార్ కార్డు మీ వ్యక్తిగత గుర్తింపును ఎలా తెలుపుతుందో, ఈ ఫార్మర్ ఐడీ మీ వ్యవసాయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తుంది. మీ పేరు మీద ఎంత భూమి ఉంది? ఏ ఏ పంటలు వేస్తున్నారు? ఏ రకమైన ఎరువులు వాడుతున్నారు? పశువులు ఉన్నాయా? ఇలాంటి ప్రతి విషయం ఈ ఐడీలో నిక్షిప్తమై ఉంటుంది.
చాలా మంది అనర్హులు కూడా పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు పొందుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి, అసలైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూర్చడానికి ఈ ఫార్మర్ ఐడీని తప్పనిసరి చేసింది. సిస్టమ్‌లో మీ ఐడీ అప్‌డేట్ కాకపోతే, వచ్చే విడత నిధుల జాబితా నుంచి మీ పేరును ఆటోమేటిక్‌గా తొలగించే అవకాశం ఉంది. ఈ డిజిటల్ డేటా వల్ల భవిష్యత్తులో ఎరువుల కొరతను నివారించడానికి, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ త్వరగా సెటిల్ చేయడానికి కూడా ప్రభుత్వానికి వీలవుతుంది.
ఈ కొత్త ఐడీ కోసం రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. దీని కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాలు ఉన్నాయి. ఇంటర్నెట్ వాడటం తెలిసిన వారు AgriStack వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ కార్డు ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసి, భూమి వివరాలను నమోదు చేయాలి. మొబైల్ వాడటం రాని వారి కోసం ప్రభుత్వం గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తోంది. అక్కడికి వెళ్లి మీ ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ బుక్ చూపిస్తే చాలు.. అధికారులు మీ వివరాలను వెరిఫై చేసి వెంటనే మీ యూనిక్ ఫార్మర్ ఐడీని జనరేట్ చేస్తారు.