PM Modi : రామ్మోహన్ నాయుడుకి ప్రధాని ప్రశంసలు.. ఇప్పుడేమంటారు..?

Update: 2025-12-09 07:22 GMT

దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభంపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్లైట్లు క్యాన్సల్ కావడానికి అతిపెద్ద కారణం ఇండిగోనే. ఆ సంస్థ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతూ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ దొరికిందే ఛాన్స్ అన్నట్టు చాలామంది కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుని తప్పుపడుతున్నారు. కొన్ని నేషనల్ మీడియాలు పనిగట్టుకుని రామ్మోహన్ నాయుడుని టార్గెట్ చేస్తున్నారు. ఆర్నబ్ గోస్వామి లాంటివాళ్లు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో కూడా మనం చూస్తున్నాం. వాస్తవానికి రామ్మోహన్ నాయుడు తన శాఖ విషయంలో చాలా బాధ్యత తీసుకుంటున్నారు. ఇండిగో విషయంపై చాలా సీరియస్ గానే పనిచేస్తున్నారు. ప్రయాణికులు ఏ ఎయిర్పోర్టులో ఇబ్బంది పడితే అక్కడికి స్పెషల్ ఫైట్లు పంపించి రద్దీని తగ్గిస్తున్నారు.

ఎప్పటికప్పుడు డిజీసీఏ అధికారులతో పాటు ఇండిగో ప్రతినిధులతో మాట్లాడుతూ ఫ్లైట్లను పునరుద్ధరించే ఏర్పాట్లు చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఫ్లైట్లు క్యాన్సల్ కావడం కూడా తగ్గిపోయింది. అయినా సరే ఆయనను పదేపదే విమర్శిస్తున్న వారికి అతి పెద్ద చెంపపెట్టు లాగా ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ రామ్మోహన్ నాయుడుని ప్రశంసించారు. సంక్షోభం వేల మంచి నిర్ణయాలు తీసుకుంటూ అద్భుతంగా పనిచేస్తున్నారు అంటూ రామ్మోహన్ నాయుడుని మెచ్చుకున్నారు ప్రధాని మోడీ. కొందరు తెలిసీ తెలియక చేస్తున్న విమర్శలను ఆరోపణలను పట్టించుకోకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇక్కడ రామ్మోహన్ ను విమర్శిస్తున్న వాళ్లు ఒక విషయం గమనించాలి. నిజంగానే ఆయన సరిగ్గా పనిచేయకపోతే ప్రధాని ఓపెన్ గా ప్రశంసించాల్సిన పనిలేదు కదా. ప్రధాని మోడీ పని చేసిన వారిని మెచ్చుకుంటారు అనే విషయం అందరికీ తెలిసిందే.

రామ్మోహన్ నాయుడు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో అందరికీ కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు ప్రధాని ప్రశంసించడం ఆయనకు ఒక పెద్ద అడ్వాంటేజ్. ఆయన విమర్శిస్తున్న నోర్లు అన్నీ ఇప్పుడు మూతపడిపోయాయి. రామ్మోహన్ నాయుడు నిజంగా పని చేస్తున్నారా లేదా అని చెప్పడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ. ఇండిగోను తప్పు పట్టకుండా ఒక కేంద్ర మంత్రిని తప్పుపడుతూ ఆయన టీడీపీ లీడర్ కాబట్టి వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మంచిది కాదు. నిజంగా రామ్మోహన్ నాయుడు బాధ్యత తీసుకోకపోతే అప్పుడు విమర్శించాల్సిందే. కానీ ఆయన ఎక్కడ ప్రవర్తించట్లేదు. తన శాఖ బాధ్యతలను పూర్తిగా భుజాన వేసుకుని సంక్షోభాన్ని వీలైనంత త్వరగా అధిగమిస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఆయనకు మద్దతు తెలపాలి గాని ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు.


Full View

Tags:    

Similar News