PM Modi : ప్రధాని మోడీ లావోస్ టూర్ షెడ్యూల్ ఇదే

Update: 2024-10-08 14:30 GMT

ఈ నెల 10, 11 తేదీల్లో ప్రధాని మోడీ లావోస్ లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా మోడీ 21వ ఆసియాన్-ఇండియా, ఇండియా సమ్మిట్, 19వ ఈస్ట్ ఏషియా(ఎంఈఏ) సదస్సులో పాల్గొంటారని తెలిపింది. ప్రస్తుతం ఆసియాన్-ఇండియాకు లావోస్ అధ్యక్షత వహిస్తోంది.

ఈ సమావేశాల్లో భారత్ వివిధ దేశాలతో భాగస్వామ్య ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై చర్చించే అవకాశముందని మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా మోడీ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక విష యాలకు సంబంధించిన సమావేశాల్లోనూ పాల్గొంటారని సమాచారం. భారతదేశంలో యాక్ట్ ఈస్ట్ పాలసీ వచ్చి దశాబ్దకాలం అవుతోందని.. ఈ పాలసీ ఇండో-పసిఫిక్ అభివృద్ధికి కీలకమైందని విదేశాంగశాఖ పేర్కొంది.

Tags:    

Similar News