PM Narendra Modi : మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారును ప్రారంభించిన పీఎం నరేంద్రమోదీ
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మారుతీ సుజుకికి చెందిన తొలి ఎలక్ట్రిక్ కారును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. మారుతీ సుజుకి, టయోటాతో కలిసి ఈ కొత్త కారును రూపొందించింది. ఈ కారు పేరు e-విటారా.అహ్మదాబాద్‌లోని హన్సల్‌పూర్‌లో ఉన్న సుజుకి మోటార్ ప్లాంట్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ e-విటారా కారు భారతదేశంలో తయారై, ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 దేశాలకు ఎగుమతి కానుంది. దీని ద్వారా భారత్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ఒక గ్లోబల్ హబ్‌గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే కార్యక్రమంలో, ప్రధానమంత్రి మారుతీ సుజుకి ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన కొత్త హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల తయారీ ప్లాంట్‌ను కూడా ప్రారంభించారు. సుజుకి, తోషిబా, డెన్సో కంపెనీలు సంయుక్తంగా ఈ ప్లాంట్‌ను నెలకొల్పాయి. దీని ద్వారా దేశీయంగానే బ్యాటరీల ఉత్పత్తి పెరిగి, దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా, ప్రధాని మోదీ మాట్లాడుతూ, "మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్" అనే నినాదానికి ఇది ఒక పెద్ద అడుగు అని కొనియాడారు. ఈ e-విటారా కారు భారతీయ మార్కెట్‌లోకి సెప్టెంబర్ 2025లో విడుదల కానున్నట్లు అంచనా.