జార్ఖండ్లో తొలివిడత అసెంబ్లీ ఎన్ని కల ప్రక్రియ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రా రంభమైంది.తొలిదశలో 15 జిల్లాల్లోని 43 స్థా నాలకు పోలింగ్ జరుగుతోంది. 685 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. 200 కంపెనీల భద్రతా బలగాలతో ఈసీ కట్టుదిట్ట మైన భద్రత ఏర్పాటు చేసింది. ఎన్నికల కోసం మొత్తం 15,344 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 12716, పట్టణ ప్రాంతాల్లో 2628 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో 950 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. 1153 మహిళా పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. ఈనెల 20న 38 స్థానాలకు తుది విడత పోలింగ్ జరగనుంది. ఈనెల 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా ఓటర్లందరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పిలుపునిచ్చారు. వీటితో పాటు రాజస్థాన్ లో 7, అస్సాంలో 5, బెంగాల్ 6, కర్ణాటకలో 3 అసెంబ్లీ స్థానాలకు, నాందేడ్, వయనాడ్ లోక్ సభ స్థానాలకు కూడా ఇవాళ ఉపఎన్నికలు జరగుతున్నాయి.