Tata Steel Chess 2025: వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ ను ఓడించిన ప్రజ్ఞానంద..

టాటా స్టీల్ చెస్ మాస్ట‌ర్స్‌ టైటిల్ గెలిచిన ప్ర‌జ్ఞానంద‌;

Update: 2025-02-03 05:30 GMT

ఇటీవ‌ల వ‌రల్డ్ టైటిల్ ఛాంపియ‌న్‌షిప్ గెలిచిన డీ గుకేశ్‌కు మ‌రో భార‌త గ్రాండ్‌మాస్ట‌ర్ ప్ర‌జ్ఞానంద తాజాగా ఝుల‌క్ ఇచ్చాడు. ప్ర‌పంచ ఛాంపియ‌న్ గుకేశ్‌ను ఓడించి ప్ర‌జ్ఞానంద టాటా స్టీల్ చెస్ మాస్ట‌ర్స్‌ టైటిల్ గెలిచాడు. టైబ్రేక‌ర్‌లో గుకేశ్‌పై ప్ర‌జ్ఞానంద గెలిచాడు. అంత‌కుముందు ప్ర‌జ్ఞానంద‌, గుకేశ్ త‌మ చివ‌రిదైన 13వ రౌండ్‌లో ఓడిపోయారు. విన్సెంట్ చేతిలో ప్ర‌జ్ఞానంద ప‌రాజయం పొందితే.. గుకేశ్‌ను అర్జున్ ఇరిగైశి ఓడించాడు. అయితే, 8.5 పాయింట్ల‌తో సంయుక్తంగా అగ్ర‌స్థానంలో ఉన్న ప్ర‌జ్ఞానంద‌, గుకేశ్ టైటిల్ కోసం టైబ్రేక‌ర్‌లో పోటీప‌డ్డారు. ఇందులో విజ‌యం సాధించిన ప్ర‌జ్ఞానంద టైటిల్ విజేత‌గా నిలిచాడు. 

చెస్‌లో ఇద్దరు భారతీయ దిగ్గజాల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. వరల్డ్ చాంపియన్ గుకేష్‌ను ఓడించి ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. టైబ్రేకర్‌లో మ్యాచ్ గెలిచి టాటా స్టీల్ మాస్టర్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ టైటిల్ ను ట్రై బ్రేకర్ లో2-1తో ప్రపంచ ఛాంపియన్ గుకేష్ ను ఓడించి టైటిల్ ను గెలుచుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్ అయిన తర్వాత తొలి గేమ్ లో గుకేష్ ఓటమిపాలయ్యాడు. అంతకు ముందు ఇద్దరు భారత చెస్ ప్లేయర్స్ ఓడిపోయారు.

అర్జున్ ఇరిగైశి చేతిలో గుకేష్ ఓడిపోయాడు. ప్రజ్ఞానంద విన్సెంట్ చేతిలో పరాజయం పాలయ్యారు. కాగా టైటిల్ కోసం ఇద్దరి మధ్య ట్రై బ్రేకర్ మ్యాచ్ జరిగింది. 8.5పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న గుకేష్, ప్రజ్ఞానంద టైటిల్ కోసం ట్రై బ్రేకర్ లో తలపడ్డారు. ఈ పోటీలో ప్రజ్ఞానంద విజయం సాధించాడు. టాటా స్టీల్ మాస్టర్స్ టైటిల్ గెలుచుకున్న రెండో భారతీయ చెస్ ప్లేయర్ గా ప్రజ్ఞానంద నిలిచాడు. అంతకు ముందు దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ ఐదుసార్లు ఈ ట్రోఫీని గెలుచుకున్నాడు.

Tags:    

Similar News