Prakash Ambedkar : ఛాతినొప్పితో హాస్పిటల్‌లో ప్రకాశ్ అంబేద్కర్

Update: 2024-10-31 03:15 GMT

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు 70 ఏళ్ల వయసులో ఈ తెల్లవారుజామున ఛాతీ నొప్పి రావడంతో వెంటనే పూణెలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గుండెలో రక్తం గడ్డకట్టినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రకాశ్ అంబేద్కరు చెందిన రాజకీయ పార్టీ వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ) ఆయన ఆరోగ్యంపై ఓ ప్రకటన వెల్లడించింది. ప్రకాశ్ అంబేద్కర్ మరో మూడు నుంచి ఐదు రోజుల పాటు వైద్యుల అబ్జర్వేషన్లో ఉంటారని తెలిపింది

Tags:    

Similar News