Prashant Kishor: మళ్లీ కాంగ్రెస్‌తో కలిసి పని చేయను: ప్రశాంత్ కిషోర్
Prashant Kishor: కాంగ్రెస్ పార్టీ తన ట్రాక్ రికార్డు దెబ్బతీసిందన్నారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.;
Prashant Kishor: కాంగ్రెస్ పార్టీ తన ట్రాక్ రికార్డు దెబ్బతీసిందన్నారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆ పార్టీతో పని చేయకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. బిహార్ రాష్ట్రంలో మార్పు కోసం ఇటీవల ప్రకటించిన ఆయన.. వైశాలి జిల్లాలో ఓ సమావేశంలో పాల్గొన్నారు. 2011 నుంచి ఇప్పటివరకూ 11 ఎన్నికల్లో తానూ భాగస్వామినయ్యానని చెప్పారు. కానీ ఒక్కసారి మాత్రమే ఓడిపోయానని..అది కూడా కాంగ్రెస్‌తోనేనని చెప్పారు.
2017 యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేశానన్నారు. గతంలో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. సోనియాగాంధీతోనూ ఒకటి, రెండు సార్లు భేటీ అయ్యారు పీకే. పార్టీల చేపట్టాల్సిన మార్పుల గురించి పలు సూచనలు చేశారు. ఐతే కొన్ని కారణాల వల్ల పార్టీలో చేరలేదు పీకే. తర్వాత బిహార్ రాజకీయాల్లో చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 2 నుంచి బిహార్‌లో పాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు.