President Droupadi Murmu : కుంభమేళాలో రాష్ట్రపతి.. ద్రౌపదీ ముర్ము పుణ్యస్నానం
అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం లో కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ పాల్గొన్నారు. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద ఆమె పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళా లో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రయాగ్ రాజ్ కు చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆది త్యనాథ్ స్వాగతం పలికారు. తర్వాత వారితో కలిసి ద్రౌపదీ ముర్ము బోటులో ప్రయాణించారు. మార్గమధ్యంలో వలస పక్షులకు ఆమె ఆహారం అందించారు. అనంతరం త్రివేణి సంగమం వద్దకు చేరుకొని పుణ్యస్నానమాచరించి, పూజలు చేశారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఈ నెల 26 మహాశివరాత్రితో ము గుస్తుంది. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనేందు కు భారీ సంఖ్యలో దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటివరకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపారరంగాలతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్య పౌరులు కలిపి 44 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ సర్కారు వెల్లడించింది. అంతకు ముందు 1954లో భారతదేశం తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభమేళలో పవిత్ర స్నానం చేశారు.