Former Railway Minister Lalu Prasad Yadav లాలూ విచారణకు రాష్ట్రపతి అనుమతి

Update: 2025-05-09 09:30 GMT

‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో మాజీ రైల్వేమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఈడీ విచారణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతించారు. రైల్వే ఉద్యోగుల కుంభకోణంలో లాలూతో పాటు అతని కుటుంబ సభ్యుల విచారణకు పర్మిషన్ ఇవ్వాలని 2022లో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. తాజాగా రాష్ట్రపతి నుంచి అనుమతి లభించింది. కాగా లాలూ రైల్వేమంత్రిగా ఉన్న సమయంలో గ్రూప్-D ఉద్యోగాలకు భూమిని లంచంగా తీసుకున్నారనే ఆరోపణలపై కేసు నమోదైంది. లాలూ ప్రసాద్‌ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో తనకు లంచంగా స్థలాలిచ్చిన వారికి రైల్వే ఉద్యోగాలను కట్టబెట్టారని ఆరోపించింది. ఈ కేసులో లాలూను విచారించేందుకు భారతీయ నాగరిక్‌ సురక్ష సంహితలోని సెక్షన్‌ 197(1) ప్రకారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతించారని అధికారిక వర్గాలు గురువారం వెల్లడించాయి.

Tags:    

Similar News