President Murmu : టీచర్ గా మారిన రాష్ట్రపతి ముర్ము.. ఏం లెసన్ చెప్పారంటే?

Update: 2025-03-05 10:30 GMT

దేశ ప్రథమ పౌరురాలిగా ద్రౌపదీ ముర్ము బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భం గా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. ప్రెసిడెంట్ ఎస్టేట్ లోని డా.రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు వెళ్లి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. తొలుత విద్యార్థులను పరిచయం చేసుకున్నారు. వారి అభిరుచులు, లక్ష్యాలు అడిగి తెలుసుకున్నారు. ఈ తరం విద్యార్థులు ఎంతో ప్రతిభా వంతులని, సాంకేతికంగా వీరికి పుష్కలమైన అవకా శాలు ఉన్నాయని ముర్ము అన్నారు. అనంతరం గ్లోబల్ వార్మింగ్పై వారికి బోధించారు. భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యాన్ని వివరిం చారు. పర్యావరణ మార్పు ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలని విద్యా ర్థులను ప్రోత్సహించారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి) గురించి ప్రస్తావించారు. ఒడిశాకు చెందిన ద్రౌపదీ ముర్ము దేశ 15వ రాష్ట్రపతిగా 2022 జులై 25న ప్రమాణ స్వీకారం చేశారు. 1994-97 మధ్య రాయ్ంగ్ పూర్లోని శ్రీఅరబిందో ఇంటిగ్రెల్ ఎడ్యుకేషన్ సెంటర్లో గౌరవ అసిస్టెంట్ టీచర్ గా వ్యవహరించారు.

Tags:    

Similar News