దుండిగల్ ఎయిర్ ఫోర్స్ పరేడ్‌లో పాల్గొన్న రాష్ట్రపతి
కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి ముర్ము.;
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పరేడ్ కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి రివ్యూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి హాజరయ్యారు. శిక్షణలో ప్రతిభ చూపిన క్యాండెట్లకు అవార్డుల ప్రదానం చేశారు. స్నేహపూర్వక దేశాల నుంచి వచ్చి వైమానిక దళ అకాడమీలో శిక్షణ పొందిన క్యాడెట్‌లకు రాష్ట్రపతి వింగ్స్, బ్రెవెట్‌ను అందజేశారు. వైమానిక దళాల విన్యాసాలను తిలకించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి ముర్ము.శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలు గుర్తుంచుకోవాలని తెలిపారు. టర్కీలో జరిగిన భూకంపంలో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాగా పనిచేసిందని కొనియాడారు. కోవిడ్ లోనూ చాలా అద్భుతంగా పనిచేసిందన్నారు. సవాళ్ళను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఏప్రిల్‌లో సుఖాయ్ జెట్‌లో ప్రయణించినట్లు తెలిపారు. ఇది తనకు చాలా గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. ఫైటర్ జెట్ ఫైలెట్లులో మహిళలు కూడా అధికంగా ఉండటం సంతోషదాయకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు.
రాష్ట్రపతి ముర్ము పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో రెండ్రోజుల పాటు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సీటీవో జంక్షన్, బేగంపేట్, గ్రీన్ ల్యాండ్స్ జంక్షన్, పంజాగుట్ట జంక్షన్, NFCL జంక్షన్లలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.